Sidhu Moosewala: పంజాబ్‌ సింగర్ సిద్ధూ మూసేవాలా దారుణ హత్య

Sidhu Moosewala:  పంజాబ్‌ సింగర్ సిద్ధూ మూసేవాలా దారుణ హత్య
Sidhu Moosewala: పంజాబ్ ప్రముఖ‌ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యారు.

Sidhu Moosewala: పంజాబ్ ప్రముఖ‌ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్తున్న జీపుపై ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. 20 రౌండ్ల కాల్పులకు దిగడంతో సిద్ధూ స్పాట్‌లోనే చనిపోయాడు. ఈ ఘటన పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో జరిగింది. బుల్లెట్‌ గాయాలతో ఆయన తన సీట్‌పైనే కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

సిద్దూ మూసేవాలగా దేశవ్యాప్త గుర్తింపు సంపాదించుకున్నారు శుభ్‌దీప్‌ సింగ్‌ సిద్ధూ. కెనడియన్‌, మూసేటేప్‌, పీబీఎక్స్‌1 ఆల్బ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తుపాకీలు, గ్యాంగ్‌ స్టర్లు... ఇలా హింసను ప్రేరేపించేవి ఎక్కువగా పాటల్లో చూపించే వివాదాస్పద గాయకుడిగా గతంలో సిద్దూ మూసేవాల వార్తల్లో నిలిచారు. ఆయన పాడిన బంబిహ బోలే, 47 పాట అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. 2020 జూలై కొవిడ్‌ లాక్‌డౌన్ విధించినప్పుడు ఫైరింగ్‌ రేంజ్‌లో ఏకే 47 రైఫిల్‌ను ఉపయోగించినందుకు ఆయనపై కేసు నమోదైంది.

గత ఏడాది డిసెంబర్‌లో కాంగ్రెస్‌లో చారు. తాజా ఎన్నికల్లో పంజాబ్‌లోని మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆప్‌ అభ్యర్థి డా. విజయ్‌ సింగ్లా చేతిలో ఓడిపోయారు. శనివారం 420 మంది వీఐపీలకు ఆప్‌ సర్కార్‌ భద్రత తొలగించింది. ఇది జరిగి రోజు గడవకముందే సిద్ధూపై దాడి జరిగింది.. ఈ ఘటన పంజాబ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.

సిద్దూ హత్యపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. సిద్దూ మూసేవాల హత్య విషయం తెలుసుకుని దిగ్ర్బాంతికి లోనయ్యానన్నారు. మూసేవాల హత్య, పార్టీకి యావత్ దేశానికి తీవ్ర దిగ్ర్బాంతి కలిగించిందని కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

Tags

Read MoreRead Less
Next Story