ప్రపంచంలోనే 'గ్రేటెస్ట్ మిషన్' గురించి 'పూరీ' వివరణ..

ప్రపంచంలోనే గ్రేటెస్ట్ మిషన్ గురించి పూరీ వివరణ..
మరి నువ్వు సిగరెట్లు కాలుస్తావు కదా.. మాకెందుకు చెబుతున్నావని అడుగుతారేమో..

ఖరీదైన వస్తువులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.. ఆఖరికి కారుకి చిన్న గీత పడితే ఎంత బాధపడిపోతామో.. అదే మన శరీరం అనారోగ్య సంకేతాలిచ్చినా ఏ మాత్రం పట్టించుకోం.. అదే విషయాన్ని దర్శకుడు పూరీ జగన్నాథ్ తనదైన స్టైల్లో వివరిస్తున్నారు. మ్యూజింగ్స్ పేరుతో ఎన్నో విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్న పూరీ ఈసారి మరో కొత్త అంశాన్ని ఎంచుకున్నారు.. కొత్తదేం కాదు పాతదే.. మనిషి శరీరం గురించి.. ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ మిషన్ అంటే మీకు ఏది గుర్తుకొస్తుంది.. కంప్యూటర్, బీఎండబ్ల్యు, ప్లైట్, రాకెట్, శాటిలైట్.. కానీ అన్నిటికంటే మిరాకిల్ మిషన్ ఏదైనా ఉందీ అంటే అది మన బాడీనే అని అంటున్నారు... పబ్ కెళ్లి పీకలవరకు తాగుతాం.. లివర్ డ్యామెజ్ అవుతుందని తెలిసినా పట్టించుకోం.

మన వెహికల్ కండిషన్ లో ఉందా లేదా అని ఆలోచిస్తాం కానీ, మన బాడీ కండిషన్ గురించి పట్టించుకోం.. మన శరీరంలో ప్రతి కణం, అణువణువు మన ఆరోగ్యం కోసమే ట్రై చేస్తుంటాయి. మనం మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. మన శరీరం మీద మనం ఏ మాత్రం శ్రద్ధ పెట్టం. గుట్కా, గుడుంబా, సిగరెట్లు, మందు, ఇలా ఒకటేమిటి అడ్డమైన గడ్డి అంతా తీసుకుంటాం. మరి నువ్వు సిగరెట్లు కాలుస్తావు కదా.. మాకెందుకు చెబుతున్నావని అడుగుతారేమో.. అలా చేశాను కాబట్టే దాని వాల్యూ తెలుసుకుని మాట్లాడుతున్నాను. నా మాట వినండి.. వెళ్లాల్సిన దారి చూపిస్తూ అనకాపల్లి 40 కి.మీ అనే బోర్డు ఉంటుంది. అసలీ బోర్డెందుకు అనే వితండ వాదం చేస్తే అక్కడే ఉంటాం.. అనకాపల్లి వెళ్లం అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story