అమ్మాయిలకు పూరీ హితబోధ

అమ్మాయిలు కలల్లో విహరిస్తుంటారని, వాస్తవానికి దూరంగా భ్రమల్లో బతుకుతుంటారని టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటున్నారు. పూరీ మ్యూజింగ్స్ పేరుతో తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పూరీ ఈసారి అమ్మాయిల ఆలోచన విధానం ఎలా ఉంటుందో వివరించారు. అమ్మాయిలు తమకి తాము క్లియో పాత్రల్లా ఫీలవుతారు. నిజానికి వాళ్లు చాలా లాజికల్‌గా ఆలోచిస్తారు. బాగా ప్రేమిస్తారు. ఎదుటి మనిషిని బాగా అంచనా వేస్తారు. ఇలా అన్నీ మంచి లక్షణాలే ఉన్నా పొగడ్తలకి లొంగిపోతారు.. అబ్బాయిలో పక్కింటి అమ్మాయితో అడ్జెస్ట్ అవుతారు.
కానీ అమ్మాయిలు మాత్రం సినిమా హీరోలు, సిక్స్‌ఫ్యాక్ ఉన్నవారిని కోరుకుంటారు.. ఒకవేళ అలా కండలు తిరగే వీరుడిని సెలెక్ట్ చేసుకున్నా ఆరు నెలలు తిరిగే సరికి వాడికీ పొట్ట వస్తుంది.. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే.. స్టైల్‌గా ఉండే బట్టలకంటే సౌకర్యవంతంగా ఉండే బట్టలు వేసుకోండి. హీల్స్, లిప్‌స్టిక్‌లను పక్కన పెట్టండి.. మిమ్మల్ని మీరు ఐటెమ్ గాళ్‌గా ప్రదర్శించడం ఆపండి. కెరీర్ మీద చదువు మీదా శ్రద్ధ పెట్టి శక్తివంతమైన మహిళగా ఎదగండి.. ఆ తరువాతే పెళ్లి గురించి ఆలోచించండి.. కొంచెం మంచోడు, తన పని తాను చేసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకోండి.. నువ్వు రాకుమారివి కాదు. మనకి మాహిష్మతి సామ్రాజ్యం వద్దు.. బాహుబలి అసలే వద్దని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com