Pushkar Singh Dhami : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి రెండోసారి ప్రమాణ స్వీకారం

Pushkar Singh Dhami : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి బుధవారం (మార్చి 23, 2022) వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడూన్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా జరిగిన ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సహా బీజేపీ నాయకులు హాజరయ్యారు.
ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్ .. ధామి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాలను గెలుచుకొని అధికారాన్ని దక్కించుకుంది బీజేపీ.. అయితే అప్పటికే ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న పుష్కర్ సింగ్ ధామి మాత్రం ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.
ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికి.. పుష్కర్‌కే ఉత్తరాఖండ్ సీఎం పగ్గాలు అప్పగించారు. ఉత్తరాఖండ్ ఏర్పడిన గత 21 ఏండ్లలో ఒక పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
LIVE : परेड ग्राउंड, देहरादून में नवनिर्वाचित सरकार का शपथ ग्रहण समारोह https://t.co/8yyHUK6Svs
— Pushkar Singh Dhami (@pushkardhami) March 23, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com