ప్రశ్నోత్తరాల సమయం కట్

X
By - shanmukha |2 Sept 2020 9:06 AM IST
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. జీరో అవర్ కూడా కేవలం అరగంట
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. జీరో అవర్ కూడా కేవలం అరగంట మాత్రమే ఉంటుందని తెలిపింది. అయితే, ఈ నిబంధనలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజాసమస్యలపై చర్చించే అవకాశం లేకుండా చేస్తున్నారని.. ప్రజాస్వామ్యగొంతు నొక్కుతున్నారని మండిపడుతున్నారు. అయితే, దీనిపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన నేతలతో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ ఫోన్లో మాట్లాడుతూ.. సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని అభ్యర్థించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com