గురువారం భారత్ వాయుసేనలోకి చేరనున్న రాఫెల్ విమానాలు

గురువారం భారత్ వాయుసేనలోకి చేరనున్న రాఫెల్ విమానాలు
భారత వాయుసేనలోకి రాఫెల్ యుద్ధవిమానాలు గురువారం ప్రవేశించనున్నాయి.

భారత వాయుసేనలోకి రాఫెల్ యుద్ధవిమానాలు గురువారం ప్రవేశించనున్నాయి. ప్రస్తుతం హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్‌ ఉన్న రాఫెల్ విమానాలు భారతవాయుసేనలోకి లాంచనంగా ప్రవేశపెడతారు. ఈ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఫ్రాన్స్‌ రక్షణమంత్రి ఫ్లారెన్స్‌ పార్లీ, భారత సైన్యాధికారులు పాల్గొంటారు. మొత్తం 36 రాఫెల్ విమానాలు కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 60వేల కోట్లు కాగా.. సుమారు సగానికిపైగా డబ్బును భారతప్రభుత్వం చెల్లించింది. అయితే, మొదటి విడతలో భాగంగా ఐదు రాఫెల్ విమానాలు జూలై 29న భారత్ కు చేరాయి. అందులో రెండు విమానాలు రెండు సీట్లువి కాగా.. మూడు విమానాలు ఒకే సీటు కలిగి ఉంటాయి. భారత్ చేరిన వెంటనే ఈ విమానాలు శిక్షణలో చేరిపోయాయి. అయితే, రేపు ఈ విమానాలు అధికారకంగా భారతవాయుసేనలో చేరుతాయి. దీంతో 17 గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్ర‌న్‌లో రాఫెల్ విమానాలు భాగం కానున్నాయి. త్వరలో రెండో విడత రాఫెల్ విమానాలు కూడా భారత్ కు చేరే అవకాశం ఉంది. ఈ సారి ఈ విమానాలు ప‌శ్చిమబెంగాల్‌లోని హ‌స్మీరా ఎయిర్ బేస్‌లో ఉంచ‌నున్నారు.

Tags

Next Story