బాబ్రీ కూల్చివేత తీర్పుపై స్పందించిన ఎంపీ రఘురామకృష్ణరాజు

బాబ్రీ కూల్చివేత కేసులో ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషిలు నిర్ధోషులుగా బయటపడటం శుభపరిణామమన్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు. బీజేపీ అగ్రనేతలందరికి శుభాకాంక్షలు తెలిపారు. బాబ్రీ కూల్చివేతతో సహా పలు అంశాలపై మాట్లాడారు ఎంపీ రఘువరామకృష్ణరాజు.
రెడ్డి అనేది గ్రామాల్లో గౌరవసూచకంగా ఇచ్చే ఒక బిరుదని, దానికి అనర్హులైనవారు కూడా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.నిజానికి రెడ్డి అనే సామాజికవర్గమంటే తనకు అత్యంత గౌరవమన్నారు ఎంపీ.
అటు క్రైస్తవుల గురించి మాట్లాడారు వైసీపీ ఎంపీ. కొంతమంది క్రైస్తవులుగా మతం మార్చుకుని దళితులమని చెప్పుకుంటున్నారన్నారు. క్రైస్తవులుగా ఉండి.. నకిలీ కులపత్రాలు తీసుకుంటున్నారు. రాజ్యాంగం ప్రకారం క్రైస్తవులు కులపత్రాలు తీసుకోకూడదన్నారు.
ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల గురించి కూడా మాట్లాడారు ఎంపీ రఘురామకృష్ణరాజు. మత వ్యాప్తిలో భాగంగానే ఇంగ్లీష్‌ను ప్రవేశపెట్టారన్నారు. ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన ఉద్యోగాలు రావన్నారాయన. ఇంగ్లీష్ మాట్లాడే ఇంగ్లండ్‌లోనూ నిరుద్యోగం ఉందని గుర్తు చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com