Rahul Gandhi: మంచు ఖండంలో ముగిసిన యాత్ర.. ఆకట్టుకున్న అక్కా తమ్ముళ్ల స్నోబాల్ ఫైట్

Rahul Gaandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగిసింది. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పలు ప్రాంతీయ పార్టీలను కలుపుకుని కాంగ్రెస్ పెద్ద ఈవెంట్‌ను నిర్వహించింది. అదే సమయంలో రాహుల్ యాత్ర ముగింపు కార్యక్రమానికి పలువురు ప్రముఖ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ముగింపు వేడుక కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు, రాహుల్ గాంధీ అక్క ప్రియాంక గాంధీని మంచులో కాసేపు సరదాగా ఆటపట్టించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాహుల్ అక్కని చూడగానే ఒక్క క్షణం చిన్న పిల్లవాడు అయిపోయాడు.. రెండు స్నో బాల్స్ తీసుకుని అక్క ప్రియాంకపై హఠాత్తుగా దాడి చేశారు. అతడు అక్క తలపై స్నో బాల్స్‌ను పగులగొట్టాడు. దాంతో ఆమె కూడా సోదరుడిని పరిగెట్టించింది. మంచు ముద్దలతో తమ్ముడిని ముద్దుగా వెంబడించింది.
"షీన్ ముబారక్! శ్రీనగర్‌లోని #BharatJodoYatra క్యాంప్‌సైట్‌లో ఒక అందమైన చివరి ఉదయం" అని రాహుల్ వీడియోను పంచుకున్నారు.
Sheen Mubarak!😊
— Rahul Gandhi (@RahulGandhi) January 30, 2023
A beautiful last morning at the #BharatJodoYatra campsite, in Srinagar.❤️ ❄️ pic.twitter.com/rRKe0iWZJ9
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com