Rahul and Priyanka to visit Lakhimpur : లఖీంపూర్ బాధిత కుటుంబాలను పరామర్శించనున్న రాహుల్, ప్రియాంక

Rahul and Priyanka to visit Lakhimpur : రాహుల్ గాంధీ లఖీంపూర్ ఖేరీ పర్యటనకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. ప్రియాంక గాంధీని సైతం కస్టడీ నుంచి విడుదల చేశారు. అటు లఖీంపూర్ వెళ్లేందుకు ప్రియాంక గాంధీకి సైతం యూపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. దీంతో రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ కూడా లఖీంపూర్ బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.
ఇవాళ్టి పర్యటనలో రాహుల్‌తో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే రాహుల్ గాంధీ లక్నో ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున లఖీంపూర్ బయల్దేరారు. యూపీ ప్రభుత్వమే గాని, పోలీసులే గాని.. కేవలం ఇద్దరు ముగ్గురు నేతలకే అనుమతి ఇస్తామని చెబుతున్నారు.
మరోవైపు ప్రియాంక గాంధీ సైతం లఖీంపూర్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. రెండు రోజులుగా ప్రియాంకను గెస్ట్ హౌజ్‌లోనే నిర్బంధించిన పోలీసులు.. కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ప్రియాంక, రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.
దీంతో ప్రియాంకను విడుదల చేసి, లఖీంపూర్ ఖేరీ పర్యటనకు అనుమతించాలని యోగి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇవాళ రేపట్లోనే ప్రియాంక గాంధీ కూడా లఖీంపూర్‌లో పర్యటించనున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com