అన్నం పెట్టే రైతన్నపై లాఠీఛార్జ్ అమానుషం: రాహుల్

కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. రైతుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. అన్నదాతలను చూసి కేంద్రం భయపడుతోందా అని ప్రశ్నించారు..దేశానికి అన్నం పెట్టే రైతన్నపై ఎందుకు లాఠీఛార్జ్ చేస్తున్నారని మండిపడ్డారు..కేంద్రం రైతుల డిమాండ్లను కచ్చితంగా వినాల్సిందేనన్నారు..సమస్యను పరిష్కరించకుండా బెదిరింపులకు దిగితే ఎలా అంటూ విమర్శించారు రాహుల్ గాంధీ.. ఢిల్లీని ఎందుకు అష్టదిగ్బంధనం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు..
అటు బడ్జెట్‌లో రక్షణరంగానికి కేటాయించిన నిధులపైనా రాహుల్ విమర్శలు గుప్పించారు. చైనాతో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న సమయంలో రక్షణ రంగానికి అరకొర నిధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.. సైన్యాన్ని పట్టించుకోం అని చెప్పదల్చుకున్నారా అని నిలదీశారు...సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికులకు జీతాలు పెంచకపోతే ఎలా అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com