మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఘాటు ట్వీట్లు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. మోదీ ప్రభుత్వంపై.. ట్విట్టర్‌లో ఘాటుగా ఆరోపణలు చేశారు. అసమ్మతి తెలిపే విద్యార్థులంతా మీకు దేశ ద్రోహుల్లా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. సమస్యలపై పౌరులు ఎవరైనా స్పందిస్తే వారిని అర్బన్ నక్సల్స్‌గా చూపిస్తున్నారని.. ట్వీట్ చేశారు. కరోనా సమయంలో స్వస్థలాలకు వెళ్లిన వలస కూలీలను మోదీ ప్రభుత్వం కొవిడ్ క్యారియర్లుగా అభివర్ణించడాన్ని రాహుల్ గుర్తు చేశారు. ఇక మీ పాలనలో.. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే నిందితులు మీ కంటికి కనిపించడంలేదని ఘాటుగా ట్వీట్ చేశారు. ఇక.. వ్యవసాయ చట్టాలు వ్యతిరేకిస్తూ.. ఆందోళనలు చేసేవారిని పలువురు మంత్రులు ఖలిస్తాన్ తీవ్రవాదులుగా పరగణించడాన్ని రాహుల్ తప్పుబట్టారు. ఇక... బడా పెట్టుబడిదారులు మాత్రమే మీకు స్నేహితులుగా కనిపిస్తున్నారని.. రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com