Rahul Gandhi : రష్యాను అనుసరిస్తున్న చైనా: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చైనా, భారత్ మధ్య గొడవను రష్యా, ఉక్రెయిన్ వార్ తో పోల్చారు. నటుడు-రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌తో జరిగిన ఇష్ఠాగోష్ఠిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి, భారతదేశం- చైనా మధ్య సరిహద్దు వివాదం ఒకే విధమైనవని తెలిపారు.
ఉక్రేనియన్లు పశ్చిమ దేశాలతో బలమైన సంబంధం కలిగి ఉండటాన్ని రష్యాన్లు జీర్ణించుకోలేకపోతున్నారని. భారత్ లోనూ ఇదే జరుగుతోందని వ్యాఖ్యానించారు. తామేం చేస్తున్నా జాగ్రత్తగా గమనిస్తుండమని చైనా భారత్ ను హెచ్చరిస్తోందన్న రాహుల్, దేశ భౌగోళిక విధానాన్ని మార్చేస్తామంటూ శత్రుదేశం హెచ్చరిస్తోందని పేర్కొన్నారు. లఢాఖ్, అరుణాచల్ ప్రదేశ్ లోకి ప్రవేశిస్తామని చైనా చెప్పకనేే చెబుతోందని వెల్లడించారు.
ఓ వైపు చైనా సరిహద్దుల్లో తిష్ఠవేసుకుని కూర్చుందని సైనికదళం మొరపెట్టుకుంటోన్నా మోదీ ఎవరూ మన భూభాగంలోకి రాలేదని చెప్పడం శోచనీయమని వ్యాఖ్యానించారు. దీంతో తమకు నచ్చింది తాము చేయవచ్చని చైనా భావిస్తోందని, భారత్ చూస్తూనే ఉంటుందన్న నమ్మకం వారికి ఏర్పడుతుందని తెలిపారు. పరిస్థితి ఇలానే ఉంటే భారత్ -చైనా నడుమ చర్చల దెబ్బతినే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com