Rahul Gandhi: మంచుకొండల్లో... చిల్ అవుతూ...

Rahul Gandhi: మంచుకొండల్లో... చిల్ అవుతూ...
మంచికొండల్లో రాహుల్ స్కీయింగ్...

భారత్ జోడో యాత్రలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దున్నేసిన రాహుల్ గాంధీ... ఇప్పుడు పూర్తిగా చిల్ మోడ్ లోకి వెళ్లిపోయారు. చివరిగా కాశ్మీర్ లోని మంచు వర్షం సాక్షిగా యాత్రను ముగించిన రాహుల ్ కు అక్కడ నుంచి కదలాలని అనిపించడంలేదో ఏమో మరోసారి అక్కడే మీడియాకు తారసపడ్డాడు. అయితే ఈసారి రాజకీయాలకు పూర్తిగా దూరంగా హాలీడే చేసుకుంటున్నాడు. మంచు కొండల్లో స్కీయింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. స్కీయింగ్ మాత్రమే కాదు, గుల్ మార్గ్ లోని కేబుల్ కార్ రైడ్ ను కూడా ఆశ్వాదించాడట. అయితే ఈ విహారయాత్రలో ఓ ప్రైవేటు ఫంక్షన్ కు రాహుల్ హాజరవ్వబోతున్నారని తెలుస్తోంది. తంగ్ మార్గ్ ప్రాంతంలోనూ విహరించిన రాహుల్ తన ట్రేడ్ మార్క్ తెల్ల టీషర్ట్ లోనే కనిపించడం మరో విశేషం. అయితే స్కీయింగ్ చేస్తున్నప్పుడు మాత్రం పూర్తిగా కవర్ అప్ చేసుకున్న రాహుల్ తో ఫోటోలు దిగేందుకు పర్యాటకులు గుమిగూడారు. అందరికీ ఓపికగ్గా సెల్ఫీలు కూడా ఇచ్చాడట. మరోవైపు త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ ఇలా విహారయాత్రకు వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags

Next Story