Rahul Gandhi: మోదీ మాతృమూర్తికి రాహుల్ క్షేమ సందేశం; త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్

Rahul Gandhi: మోదీకి మాతృమూర్తికి రాహుల్ సందేశం; త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్
ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి అనారోగ్యంతో ఆసుపత్రి పాలవ్వడంతో దేశవ్యాప్తంగా హీరాబెన్ త్వరగా కోలుకోవాలంటూ క్షేమ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంథీ కూడా మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశాడు.
తల్లి, తనయుల మధ్య ప్రేమ వెలకట్టలేనిది, శాశ్వతమైనదని పేర్కొన్న రాహుల్, ఈ క్లిష్ట సమయంలో తన ప్రేమాభిమానాలు మోదీకి తోడుగా ఉంటాయని తెలిపాడు. అమ్మ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశాడు.
మోదీ మాతృమూర్తి హీరాబెన్ ఈరోజే అనారోగ్యంతో అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా కార్డియాలజీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తల్లి గురించి వీలైనప్పుడల్లా ప్రస్తావించే మోదీ ప్రస్తుతం ఆమెను చూసేందుకు అహ్మదాబాద్ పయనం అయ్యారు. ప్రస్తుతం హీరాబెన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com