సంస్థాగత బలోపేతంపై కాంగ్రెస్‌ ఫోకస్..

సంస్థాగత బలోపేతంపై కాంగ్రెస్‌ ఫోకస్..
పార్టీ అధ్యక్ష పదవితో సహా, సంస్థాగత ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సోనియా గాంధీ నివాసం 10 జన్‌పథ్‌లో శనివారం సమావేశం నిర్వహించారు.

పార్టీ అధ్యక్ష పదవితో సహా, సంస్థాగత ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సోనియా గాంధీ నివాసం 10 జన్‌పథ్‌లో శనివారం సమావేశం నిర్వహించారు. సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, 'అసమ్మతివాద' సీనియర్ నేతలు పాల్గొన్నారు. నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ బన్సల్ మాట్లాడుతూ... పార్టీ చెప్పినట్లుగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. మీరంతా కోరుకున్నట్లుగా పార్టీ కోసం పని చేయడం నాకు ఇష్టమే అని రాహుల్ చెప్పినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు ఎవరూ రాహుల్ గాంధీని విమర్శించలేదని చెప్పారు.

ఈ ఏడాది ఆగస్టులో 23 మంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాశారు. సమష్టి నిర్ణయాలు తీసుకోగలిగిన, చురుకైన నాయకత్వం పార్టీకి అవసరమని పేర్కొన్నారు. పార్టీని ప్రక్షాళన చేయాలని కోరారు. లేఖ రాసిన నేతలు శనివారం జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి తగిన మార్గాల గురించి మేధోమథనం జరిపేందుకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల నేతలెవరికీ అభ్యంరాలు లేవని పార్టీ వర్గాలు తెలిపాయి. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో రాహుల్ గాంధీ ఆ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగారు. దీంతో పార్టీ సారథ్య బాధ్యతలను సోనియా గాంధీ మళ్లీ చేపట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతంపై జాతీయ నాయకత్వం దృష్టి సారించింది.

Tags

Read MoreRead Less
Next Story