Rahul Jodo Yatra: రాహుల్ జోడో యాత్ర.. త్వరలో సోనియా, ప్రియాంక

Rahul Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో పాద యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపడుతున్న రాహుల్‌గాంధీ పాదయాత్ర ఇవాళ 16వ రోజుకు చేరుకుంది. ఇవాళ కేరళలోని త్రిసూర్‌లో పాదయాత్ర కొనసాగుతోంది. ఈ ఉదయం 7 గంటలకు చలకుడి నుంచి పాదయాత్ర ప్రారంభించిన రాహుల్‌గాంధీ.. కాసేపట్లో కొడకరా చేరుకుంటారు. విరామం తరువాత.. మధ్యాహ్నం అంబల్లూరు నుంచి మళ్లీ పాదయాత్ర కొనసాగనుంది. రాత్రి 7గంటలకు తెక్కె గోపురనాడ వద్ద రాహుల్ గాంధీ బహిరంగ సభలో పాల్గొంటారు.
రాహుల్‌గాంధీ భారత్ జోడో పాదయాత్రకు మరింత ఆదరణ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ యాత్రలో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 30న రాహుల్‌గాంధీ పాదయాత్ర కర్నాటకలో ప్రవేశిస్తుంది. కర్నాటకలో జరిగే ఈ యాత్రలో సోనియా గాంధీ ఓ రోజు, ప్రియాంక గాంధీ మరో రోజు పాల్గొంటారని కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తెలిపారు. సోనియా, ప్రియాంక గాంధీ పాదయాత్రలో పాల్గొనే తేదీలను త్వరలోనే చెబుతామన్నారు కాంగ్రెస్ నేతలు.
నిరాటంకంగా కొనసాగుతున్న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర
16వ రోజుకు చేరుకున్న రాహుల్ పాదయాత్ర
ఇవాళ కేరళలోని త్రిసూర్‌లో పాదయాత్ర చేస్తున్న రాహుల్
ఉదయం 7 గంటలకు చలకుడి నుంచి పాదయాత్ర ప్రారంభం
11 గంటలకు కొడకరా చేరుకోనున్న రాహుల్‌గాంధీ
మధ్యాహ్నం అంబల్లూరు నుంచి మళ్లీ పాదయాత్ర మొదలు
రాత్రి 7గంటలకు తెక్కె గోపురనాడ వద్ద రాహుల్ గాంధీ బహిరంగ సభ
త్వరలోనే జోడో యాత్రలో పాల్గొననున్న సోనియా, ప్రియాంక
సెప్టెంబర్ 30న కర్నాటకలోకి రాహుల్‌గాంధీ పాదయాత్ర
సోనియా గాంధీ ఓ రోజు, ప్రియాంక మరో రోజు పాల్గొంటారన్న కాంగ్రెస్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com