Rahul Gandhi: కాబోయే భార్య ఎలా ఉండాలంటే..: పెళ్లిపై రాహుల్ క్లారిటీ

Rahul Gandhi: తనకు ఎలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానో అనే అంశంపై క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. యాభై ఏళ్లు క్రాస్ అయినా పెళ్లి ఊసే ఎత్తని ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తనకు కావాల్సిన అమ్మాయిలో ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయంలో తన మనుసులో మాట చెప్పాడు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడిన రాహుల్.. పెళ్లిపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు..
తన తల్లి సోనియాగాంధీ, నానమ్మ ఇందిరాగాంధీల లక్షణాలు కలగలిసిన భాగస్వామితో జీవితంలో స్థిరపడేందుకు రెడీ అన్నారు. నాయనమ్మ ఇందిరా గాంధీని తన రెండో తల్లిగా అభివర్ణించారు రాహుల్. అలాంటి మహిళ దొరికితే జీవితంలో స్థిరపడతారా అన్న ప్రశ్నకు ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అలాంటి లక్షణాలు ఉన్న మహిళకు ప్రాధాన్యం ఇస్తాను అన్నారు..
మరోవైపు మోటర్ సైకిల్, సైకిల్ నడపడానికి తాను ఎక్కువ ఇష్టపడతానన్నారు రాహుల్. ఎలక్ట్రిక్ బైకులు తయారు చేసే చైనా సంస్థను గుర్తు చేసుకున్నారు. తనకు కారు కూడా లేదని, తన దగ్గర ఉన్న సీఆర్-వీ కారు కూడా తన తల్లిదని తెలిపారు. కార్లు, బైకులు అంటే తనకు ఇష్టం లేదని, కానీ, రైడ్‌కు వెళ్లడమంటే ఇష్టమని చెప్పారు రాహుల్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com