చట్టాల్ని రద్దుచేసే దాకా ఉద్యమం ఆగదు : రాహుల్

చట్టాల్ని రద్దుచేసే దాకా ఉద్యమం ఆగదు : రాహుల్
X
పోలీసులు అనుమతివ్వనప్పటికీ కాంగ్రెస్ నేతలు ర్యాలీ ప్రారంభించారు. కాంగ్రెస్‌ నేతలు ర్యాలీ ప్రారంభించగానే పోలీసులు అడ్డుకున్నారు.

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో నిరసన ఉద్రిక్తంగా మారింది. విజయ్ చౌక్‌ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ చేపట్టాలని కాంగ్రెస్ నేతలు భావించారు. దీనికోసం పెద్ద ఎత్తున కీలక కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. అయితే ఢిల్లీ పోలీసులు ర్యాలీకి అనుమతివ్వలేదు. ముగ్గురికి మాత్రమే రాష్ట్రపతిని కలిసేందుకు అనుమతిచ్చారు.

దీంతో కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యాలయంలో మరోసారి సమావేశమయ్యారు. పోలీసులు అనుమతివ్వనప్పటికీ కాంగ్రెస్ నేతలు ర్యాలీ ప్రారంభించారు. కాంగ్రెస్‌ నేతలు ర్యాలీ ప్రారంభించగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ర్యాలీ నిర్వహించి తీరుతామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. రాష్ట్రపతి కోవింద్‌ను కలిసి 2 కోట్ల మంది రైతుల సంతకాలు, మెమోరాండం సమర్పిస్తామని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

అనంతరం రాహుల్ గాంధీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. రాహుల్ వెంట కాంగ్రెస్ సీనియర్‌ నేతలు గులాం నబీఆజాద్‌, అధీర్‌ రంజన్‌ చౌధురీ ఉన్నారు. దేశవ్యాప్తంగా సేకరించిన రెండు కోట్ల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని రాహుల్ రామ్‌నాథ్ కోవింద్‌ కు అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రాహుల్ సాగు చట్టాలను వెనక్కి తీసుకోకపోతే దేశం ఇబ్బందుల్లో పడుతుందని, రైతులు ఢిల్లీని వదిలి వెళ్ళారని అన్నారు.

Tags

Next Story