Rahul Gandhi : ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వచ్చిన రాహుల్ గాంధీ..!

X
By - Gunnesh UV |26 July 2021 11:45 AM IST
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై వచ్చారు రాహుల్ గాంధీ.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై వచ్చారు రాహుల్ గాంధీ. తన నివాసం నుంచి పార్లమెంట్ వరకు ట్రాక్టర్ మీదనే వచ్చిన రాహుల్ గాంధీ.. వినూత్నంగా నిరసన తెలిపారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ట్రాక్టర్‌కు హోర్డింగులు కట్టారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీతో కలిసి ట్రాక్టర్ మీద.. రణీప్ సుర్జేవాలా, దీపెందర్ హుడా మరియు అనేక ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాగా సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ రైతులు ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్నారు. గత 8 నెలలుగా వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com