Rahul Jodo Yatra: విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా సాగుతున్న రాహుల్ జోడో యాత్ర..

Rahul Jodo Yatra: విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా సాగుతున్న రాహుల్ జోడో యాత్ర..
X
Rahul Jodo Yatra: దేశంలో హింస, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర జోరుగా సాగుతోంది.

Rahul Jodo Yatra: దేశంలో హింస, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. వేలాది మంది కార్యకర్తలు వెంటరాగా.. రాహుల్ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ... వారిలో భరోసా నింపుతూ ముందుకు కదులుతున్నారు.


రాహుల్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. యాత్రలో ఎటు చూసినా కాంగ్రెస్‌ జెండాలే కనిపిస్తున్నాయి. భారత్‌ జోడో యాత్రకు విశేష స్పందన వస్తుంది. యాత్రలో భాగంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలను ప్రస్తావిస్తున్నారు రాహుల్‌.

ఇక ఇవాల్టికి రాహుల్ పాదయాత్ర 44వ రోజుకు చేరుకుంది. ఉదయం కర్ణాటక రాయచూర్‌ జిల్లా యెరగేరా గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. రాయచూర్‌లోని హోటల్ బృందావన్‌ సమీపంలో యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు రాహుల్ గాంధీ. తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది.


సాయంత్రం బసవేశ్వర సర్కిల్‌ మైదానంలో ఏర్పాటు చేయనున్న పబ్లిక్‌ మీటింగ్‌లో రాహుల్ పాల్గొంటారు. రాత్రికి రాయచూర్‌ జిల్లా ఎగ్నూర్‌లోని ఆనంద ప్రైమరీ స్కూల్‌లో రాత్రికి బస చేస్తారు. నిన్న మంత్రాలయం టెంపుల్ సర్కిల్ నుంచి గిల్లేసుగూర్‌ వరకు సాగింది. ఏపీ నుంచి తిరిగి కర్ణాటకలోకి ప్రవేశించిన రాహుల్‌కు స్థానికులు, కన్నడ కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు.

రేపు రాయచూర్‌ జిల్లా యెర్మారస్‌ దగ్గర ప్రారంభం కానున్న యాత్ర...తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మక్తల్‌లో తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తారు రాహుల్‌. తర్వాత మూడు రోజుల పాటు యాత్రకు బ్రేక్‌ ఇవ్వనున్న రాహుల్ గాంధీ....తిరిగి ఈ నెల 27న యాత్రను ప్రారంభిస్తారు. నవంబర్‌ 4 వరకు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. రాహుల్ పాదయాత్రకు టీ-కాంగ్రెస్ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

సెప్టెంబర్‌ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ యాత్ర..కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా కొనసాగింది. మొత్తం 150 రోజుల పాటు సాగనున్న భారత్‌ జోడో యాత్ర జమ్ము కశ్మీర్‌ వరకు సాగనుంది. మొత్తంగా రాహుల్ 3 వేల 500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.

Tags

Next Story