'నువ్వు నా కొడుకు' రాహుల్ గాంధీని చూసిన కేరళ నర్సు: 51 సంవత్సరాల క్రితం..

కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 51 సంవత్సరాల క్రితం తన పుట్టుకను చూసిన ఒక నర్సును కలిసారు. ఆ క్షణంలో కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది ఆ భావోద్వేగ క్షణాలు కెమెరాలో బంధించబడ్డాయి. జూన్ 19, 1970 న రాహుల్ జన్మించినప్పుడు అతనిని చూసుకున్న నర్సులలో ఒకరైన రాజమ్మ వవతిల్ ఈ వారం ప్రారంభంలో వయనాడ్ పర్యటనలో అతడిని కలిశారు. ఈ దృశ్యం వీడియో ట్విట్టర్‌లో వైరల్ అయింది.
రాజమ్మ ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తోంది. రాహుల్ జన్మించినప్పుడు ఆమె ఆ శిశువును తన చేతులతో పట్టుకుంది. వీడియోలో, ఆమె రాహుల్‌ను తన 'కొడుకు' అని పిలుస్తుంది. అతనికి స్వీట్ ప్యాకెట్‌ని బహుమతిగా ఇచ్చింది. ఆ సమయంలో ఆమె ఒకింత గర్వానికి లోనైంది. "మీకు స్వీట్లు ఇవ్వడానికి ఎవరూ నాకు అడ్డు చెప్పలేదు. ఇది నా ఇల్లు (ఆమె ఇంటిని చూపిస్తూ చెప్పింది). నేను నిన్ను కలవాలనుకున్నాను. మీ సెక్యూరిటీ గార్డులు ఎక్కడ ఉన్నారు. నేను వారికి చెప్పాలనుకుంటున్నాను ... అతను నా కుమారుడు. అతను నా కళ్ల ముందు జన్మించాడు. మీరు అతన్ని చూడకముందే, నేను అతన్ని చూశాను." అని ఆనందంతో చెబుతోంది. రాజమ్మ కాంగ్రెస్ నాయకుడి పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తున్న హృదయపూర్వక వీడియోను కాంగ్రెస్ పార్టీ కేరళ యూనిట్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com