Rahul Gandhi : ఈ మరణాలకు కేంద్రం నిర్లక్ష్యమే కారణం : రాహుల్‌గాంధీ

Rahul Gandhi : దేశంలో కరోనా వల్ల చనిపోయింది 5 లక్షల మంది కాదు.. ఏకంగా 40 లక్షల మంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. ఈ 40 లక్షల మంది చావుకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. మోదీ సర్కార్ చాలా నిజాల్ని దాచిపెట్టినట్టే ఈ మరణాల సంఖ్యనూ దాచిపెట్టిందన్నారు. కరోనా వల్ల మరణించిన ఒక్కొకరికి కుటుంబానికి 4 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని ట్వీట్ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మరణాల లెక్క తేల్చేందుకు WHO చేస్తున్న ప్రయత్నాల్ని భారత్ అడ్డుకుంటోంది అంటూ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని కూడా షేర్ చేశారు. మోదీ నిజాలు మాట్లాడరు, ఇతరుల్ని మాట్లాడనివ్వరు అంటూ ఎద్దేవా చేసిన రాహుల్.. ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదంటూ ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉన్నారని విమర్శించారు.
ఈ ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా మరణాలు 5 లక్షల 21 వేల 700 అని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్తోంది. కానీ.. రాహుల్ ఏకంగా 40 లక్షల మంది చనిపోయారనడం రాజకీయంగా BJP-కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
मोदी जी ना सच बोलते हैं, ना बोलने देते हैं।
— Rahul Gandhi (@RahulGandhi) April 17, 2022
वो तो अब भी झूठ बोलते हैं कि oxygen shortage से कोई नहीं मरा!
मैंने पहले भी कहा था - कोविड में सरकार की लापरवाहियों से 5 लाख नहीं, 40 लाख भारतीयों की मौत हुई।
फ़र्ज़ निभाईये, मोदी जी - हर पीड़ित परिवार को ₹4 लाख का मुआवज़ा दीजिए। pic.twitter.com/ZYKiSK2XMJ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com