Rahul Gandhi: ప్రధాని పదవిలో రాహుల్.. : స్వామీజీ జోస్యం

Rahul Gandhi: ప్రధాని పదవిలో రాహుల్.. : స్వామీజీ జోస్యం
Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కర్ణాటక చిత్రదుర్గలోని శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠ్‌కు చెందిన స్వామీజీ అన్నారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కర్ణాటక చిత్రదుర్గలోని శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠ్‌కు చెందిన స్వామీజీ అన్నారు. అతను నానమ్మ మరియు తండ్రి వలె ప్రధానమంత్రి అవుతాడని స్వామీజీ చెప్పారు.

కర్ణాటకలోని లింగాయత్ సెమినరీలో ఒక స్వామీజీ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని అన్నారు. మఠంలోని సన్యాసులతో సమావేశమైనప్పుడు, వారిలో ఒకరైన హవేరి హోసముత్ స్వామి, తన నానమ్మ మరియు తండ్రి గురించి ప్రస్తావించారు. వారి మాదిరిగానే రాహుల్ కూడా ప్రధాని అవుతారని అన్నారు.

అయితే ఆ సమయంలో సంస్థ అధ్యక్షుడు శ్రీ శివమూర్తి మురుగ శరణారావు అడ్డుతగులుతూ.. దయచేసి అలా అనకండి.. ఇది వేదిక కాదు.. ప్రజలే నిర్ణయిస్తారు ప్రధాని ఎవరు అవ్వాలనేది అని ఆయన అన్నారు. కర్ణాటక జనాభాలో 17 శాతం ఉన్న లింగాయత్‌లు సాంప్రదాయకంగా బీజేపీ ఓటర్లుగా ఉన్నారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో రాహుల్ పర్యటనతో ఓటర్లలో ఉత్సాహాన్ని నింపాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

వచ్చే ఏడాది మే నాటికి ఎన్నికలు జరగనుండగా, బీజేపీని గద్దె దింపేందుకు కాంగ్రెస్ ఐక్య ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు నానా తంటాలు పడుతోంది. 2013 నుండి 2018 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ 2018 ఎన్నికల తర్వాత జనతాదళ్ (సెక్యులర్) భాగస్వామ్యంతో కొంతకాలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వం -- JDS నాయకుడు హెచ్‌డి కుమారస్వామి నేతృత్వంలోని -- సంకీర్ణానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాత కేవలం ఒక సంవత్సరంలోనే కూలిపోయింది. ఆ తర్వాత మళ్లీ రాష్ట్రంలో బిజెపి పాలనలోకి వచ్చింది.

బీజేపీ మొదట్లో లింగాయత్ వర్గానికి చెందిన బిఎస్ యడియూరప్పను ముఖ్యమంత్రి చేసింది. గతేడాది ఆయన స్థానంలో అదే వర్గానికి చెందిన బసవరాజ్ బొమ్మైని నియమించారు. లోలోపల విభేదాలతో కాంగ్రెస్ పోరాడుతోంది. పార్టీ అధికారంలోకి వస్తే శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య, రాష్ట్ర శాఖ చీఫ్ డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవికి పోటీ పడుతున్నారు.

మంగళవారం రాత్రి జరిగిన రాష్ట్ర యూనిట్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించడానికి ప్రయత్నించారు. నాయకులు కలిసి పని చేయాలని, బహిరంగంగా విమర్శలకు దిగవద్దని ఆయన కోరారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ.. నాయకత్వ సమస్య అసలే లేదు.. వ్యక్తిగత అభిప్రాయం కూడా ఆమోదయోగ్యం కాదు.. గెలిచిన తర్వాత నాయకుడిని పార్టీ కొత్త ఎమ్మెల్యేలు, హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు.

ఈ కమిటీ తరచుగా సమావేశమై పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సమిష్టి నిర్ణయాలు తీసుకుంటుందని, కర్నాటక, కేంద్రంలో బీజేపీ దుష్టపాలనపై దూకుడుగా, ఐక్యంగా ముందుకు సాగాలని రాహుల్ గాంధీ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. అంతర్గత విషయాల గురించి బహిరంగంగా మాట్లాడకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. తెలిసీ తెలియక అక్కడక్కడా మీడియా ముందు కొన్ని ప్రకటనలు చేస్తుంటారని, ఆ ఉచ్చులో పడవద్దని... పార్టీ నేతలు ఇంటా బయటా భిన్న స్వరాలతో మాట్లాడకూడదని అన్నారు.

జూలై 9న కమిటీ ఏర్పడిన తర్వాత ఇది తొలి సమావేశం. రాహుల్ గాంధీ, వేణుగోపాల్‌తో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్, పార్టీ ప్రచార కమిటీ చీఫ్ ఎంబీ పాటిల్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బీకే హరిప్రసాద్ తదితరులు హాజరయ్యారు. HK పాటిల్, దినేష్ గుండు రావు, M వీరప్ప మొయిలీ మరియు G పరమేశ్వర వంటి సీనియర్ నాయకులు కూడా ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story