Rahul Jodo Yatra 36th day: రాహుల్‌ పాదయాత్ర 36వ రోజు.. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఆయన వెంట..

Rahul Jodo Yatra 36th day: రాహుల్‌ పాదయాత్ర 36వ రోజు.. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఆయన వెంట..
Rahul Jodo Yatra 36th day: కర్ణాటకలోని చిత్రదుర్గ్‌ జిల్లాలో భారత్‌ జోడో యాత్ర జోరుగా సాగుతుంది. రాహుల్‌ పాదయాత్ర 36వ రోజు 930 కిలో మీటర్ల మార్క్‌ను దాటింది.

Rahul Jodo Yatra: కర్ణాటకలోని చిత్రదుర్గ్‌ జిల్లాలో భారత్‌ జోడో యాత్ర జోరుగా సాగుతుంది. రాహుల్‌ పాదయాత్ర 36వ రోజు 930 కిలో మీటర్ల మార్క్‌ను దాటింది. పెద్దలకు పలకరింపులు, అక్కడక్కడా హారతులు, పిల్లలతో ముచ్చట్లతో కర్ణాటకలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర కొనసాగుతోంది.


వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఉదయం 6.30 కు బొమ్మగండన హళ్లి నుంచి జోడోయాత్ర ప్రారంభమైంది. ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వెంట వచ్చారు. మహిళలు రాహుల్‌కు హారతి ఇచ్చి స్వాగతం పలికారు.

చిత్రదుర్గ్ జిల్లాలో రాహల్‌ జోడో యాత్రకు ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్‌ క్యాడర్‌తో పాటు భారీ సంఖ్యలో ఉపాది హామీ కూలీలు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు రాహుల్‌ మాట్లాడేందుకు పోటీ పడ్డారు. వారితో ముచ్చటిస్తూ రాహుల్‌ తన పాదయాత్రను కొనసాగించారు.ఇక ఉదయం 11 గంటలకుకొన్సగరలో మార్నింగ్‌ బ్రేక్‌ ఇవ్వనున్నారు.అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్న రాహుల్‌ చిత్రదుర్గ్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ పై దిశానిర్ధేశం చేయనున్నారు.స్థానికులతో సమావేశం అయి సమస్యలను తెలుసుకుంటున్నారు రాహుల్‌.

తిరిగి సాయంత్రం 4.00 గంటలకు పాదయాత్ర మొదలై మొలకల్మూర్‌లోని KEB సర్కిల్‌ వరకు కొనసాగనుంది.అక్కడ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సభలోప్రసంగించనున్నారు రాహుల్‌. రాంపురాలో 36వ రోజు పాదయాత్ర ముగియనుంది. రాత్రికి రాంపురాలో రాహుల్‌ బస చేయనున్నారు.

భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌నేతలు డీకే శివకుమార్‌, మాజీ మంత్రులు,చిత్రదుర్గ్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకులు,పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. చిన్నారులు, పెద్దలు రాహుల్ తో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్నారు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. పలు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ రహదారి పక్కన ఉన్న ప్రజల వద్ద ఆగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

Tags

Next Story