Rahul Gandhi: చలికి వణుకుతున్నా స్వెట్టర్ ధరించని రాహుల్.. కారణం ఆ ముగ్గురు..

Rahul Gandhi: చలికి వణుకుతున్నా స్వెట్టర్ ధరించని రాహుల్.. కారణం ఆ ముగ్గురు..
Rahul Gandhi: వారం రోజులుగా వాతావరణంలో మార్పులు సంభవించడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలితో వణికిపోతోంది భారత్. అయినా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మాత్రం ఆగలేదు.

Rahul Gandhi: వారం రోజులుగా వాతావరణంలో మార్పులు సంభవించడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలితో వణికిపోతోంది భారత్. అయినా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మాత్రం ఆగలేదు. ఇంత చలిలోను రాహుల్ టీ-షర్ట్ మాత్రమే ధరించడంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం మాట్లాడుతూ, "చిరిగిన బట్టలతో వణుకుతున్న" ముగ్గురు పేద బాలికలను కలుసుకున్న తర్వాత యాత్రలో టీ-షర్టులు మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నానని అన్నారు.యాత్ర ప్రారంభమైనప్పుడు... కేరళలో వేడిగా, తేమగా ఉంది. కానీ మేము మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించినప్పుడు కాస్త చల్లగా ఉంది. "ఒకరోజు చిరిగిన బట్టలతో ముగ్గురు పేద ఆడపిల్లలు నా దగ్గరకు వచ్చారు.. నేను వాళ్లని పట్టుకున్నప్పుడు సరైన దుస్తులు లేవు వారి వంటి మీద. స్వెట్టర్ కొనుక్కునే స్థోమత లేని దారిద్ర్యం.. చలితో వణుకుతున్న వాళ్లని చూసి చలించి పోయాను. ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.ఎప్పుడైతే నేను చలికి తట్టుకోలేక వణుకి పోతానో అప్పుడే స్వెటర్ వేసుకోవాలని ఆలోచిస్తాను.. మీకు చలిగా అనిపిస్తే రాహుల్ గాంధీకి కూడా చలి వస్తుందని ఆ ముగ్గురు అమ్మాయిలకు సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మీడియా తన వేషధారణను హైలైట్ చేస్తున్నప్పటికీ "చిరిగిన బట్టలతో తన వెంట నడుస్తున్న పేద రైతులు మరియు కూలీలను పట్టించుకోవడం లేదని" అన్నారు.


"నేను టీ షర్ట్‌లో ఉండటం అసలు ప్రశ్న కాదు, అసలు ప్రశ్న ఏమిటంటే దేశంలోని రైతులు, పేద కార్మికులు, వారి పిల్లలు చిరిగిన బట్టలు ధరిస్తున్నారు. టీ షర్టులు, స్వెటర్లు లాంటివి వారికి ఎందుకు లేవు'' అని రాహుల్ ఆవేదన చెందారు.


వాతావరణం మరియు ఇతర కారణాల వల్ల పంటలు నాశనమైనప్పుడు బాధిత లబ్ధిదారులు నష్టపరిహారం కోసం వెళితే వారికి సరైన న్యాయం జరగట్లేదని రాహుల్ వాపోయారు. రద్దు చేయబడిన కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులను ఉటంకిస్తూ.. "వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో 700 మంది రైతులు మరణించారని, కనీసం వారి త్యాగాన్ని గుర్తించి వారికి అమరవీరుల హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో డిమాండ్ చేసింది. కాని ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టిందని, ఏ మాత్రం ఆ విషయం గురించి ఆలోచించట్లేదని అన్నారు.


ప్రస్తుతం ఈ రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర హర్యానా మీదుగా సాగుతోంది. సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర జనవరి 30న శ్రీనగర్‌కు చేరుకుని అక్కడ జాతీయ జెండాను ఎగురవేయడంతో రాహుల్ యాత్రను ముగిస్తారు.


ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో రాహుల్ పాదయాత్ర సాగింది. ఈ యాత్రకు అనూహ్య స్పందన రావడంతో కాంగ్రెస్ వర్గీయుల్లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story