Rahul Jodo Yatra: రాహుల్ జోడో యాత్ర.. కర్నాటకలో మరింత జోరుగా

Rahul Jodo Yatra: రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర కర్నాటకలో మరింత జోరుగా సాగుతోంది. భారత్ జోడో యాత్ర చేపట్టి ఇవాళ్టికి 24 రోజులు. ఇవాళ చామరాజనగర నుంచి మొదలైన పాదయాత్ర.. మైసూర్‌లోని తాండవపుర వరకు కొనసాగుతుంది. ఈ ఉదయం ఆరున్నరకు గుండ్లుపేట్ తొండవాడి గేట్ నుంచి మొదలైన పాదయాత్ర.. కలాలే గేట్ ప్రాంతానికి చేరుకోనుంది.
12 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసిన తరువాత.. కాలాలే గేట్ వద్దే రాహుల్‌గాంధీ విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి సాయంత్రం నాలుగున్నరకు పాదయాత్ర మొదలవుతుంది. రాత్రి ఏడు గంటల వరకు నిర్విరామంగా పాదయాత్ర కొనసాగుతుంది. మైసూర్ తాండవపురలోని చిక్కాయనఛత్ర వద్ద ఇవాళ్టి పాదయాత్ర ముగుస్తుంది. ఈ రాత్రికి తాండవపురలోని ఎంఐటీ ఎదురుగా రాహుల్‌గాంధీ బస చేస్తారు.
తమిళనాడు, కేరళ కంటే ఉత్సాహంగా కర్నాటకలో రాహుల్ యాత్ర జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీకి సవాల్ విసిరే స్థాయిలో కర్నాటక కాంగ్రెస్‌కు బలం ఉండడంతో.. ఆ ఉత్సాహం రాహుల్ పాదయాత్రలో కనిపిస్తోంది. త్వరలోనే కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీని ఓడించే అవకాశం ఉన్న రాష్ట్రం కూడా కర్నాటక కావడంతో.. పాదయాత్రను గ్రాండ్ సక్సెస్ చేసే పనిలో ఉన్నారు కర్నాటక కాంగ్రెస్ నేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com