Rahul Jodo Yatra: జోరుగా సాగుతున్న రాహుల్ జోడో యాత్ర.. 21వ రోజు..

Rahul Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతుంది. భారత్ జోడో యాత్ర 21వ రోజుకు చేరుకుంది. రాహుల్ రోజురోజుకి ఉత్సాహంగా పాదయాత్ర సాగిస్తున్నారు. అటు స్థానికులను కలసి సమస్యలను తెలుసుకుంటున్నారు..ఇటు కాంగ్రెస్ కేడర్‌కి దిశానిర్ధేశం చేస్తూ దుకుసాగుతున్నారు రాహుల్.
21వ రోజు రాహుల్ గాంధీ మాలప్పురంలోని పాండిక్కడ్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం 6గంటల 30నిమిషాలకు పాదయాత్ర మొదలుపెట్టారు రాహుల్. మాలప్పురం కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..ఉ.10.30 గంటలకు వండూర్ జంక్షన్‌లో మార్నింగ్ బ్రేక్ ఇవ్వనున్నారు.. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని ఆ తరువాత కాంగ్రెస్ కార్యకర్తలు,స్థానికులతో సమావేశం అయ్యారు రాహుల్
తిరిగి సాయంత్రం ఐదు గంటలకు నడువత్ వండూరు నుంచి నుంచి పాదయాత్ర మొదలై మాలప్పురంలోని నిలంబర్ టౌన్ బస్టాండ్ వరకు కొనసాగనుంది. నిలంబర్‌లో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు రాహుల్. ఇక రాత్రి నిలంబర్‌లోని అమల్ కాలేజ్‌లో రాహుల్ బస చేయనున్నారు. కాగా ఇప్పటివరకు రాహుల్ గాంధీ 460 కిలోమీటర్ల పైగా పాదయాత్ర పూర్తి చేశారు.
మరోవైపు భారత్ జోడో యాత్ర కేరళలో ఉత్సాహంగా కొనసాగుతుంది. రాహుల్ పాదయాత్రలో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. చిన్నారులు, పెద్దలు రాహుల్ తో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్నారు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. పలు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ రహదారి పక్కన ఉన్న ప్రజల వద్ద ఆగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.కేరళ సంప్రదాయ నృత్యాలు,క్రీడల్లో రాహుల్ ఆసక్తిగా పాల్గొంటూ స్థానికుల్లో జోష్ నింపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com