Rahul Jodo Yatra: కర్ణాటకలో భారత్ జోడో యాత్ర.. రాహుల్‌కు ఘనస్వాగతం

Rahul Jodo Yatra: కర్ణాటకలో భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతుంది. ఏపీలోని చేట్నేపల్లి, మాధవవరం మీదుగా కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోకి ప్రవేశించింది భారత్ జోడో యాత్ర.కర్ణాటకలోని పంచముఖి ఆర్చ్ సర్కిల్ దగ్గర రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు కన్నడ నేతలు.
రాహుల్ గాంధీకి గిల్లేసుగూర్ గ్రామంలో మహిళలు మంగళ హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.. దినసరి కూలీలు, ఉపాది హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు రాహుల్‌గాంధీ. ఇక ఇవాల్టీ భారత్ జోడో యాత్ర షెడ్యూల్ చూస్తే 43వ రోజు పాదయాత్ర మంత్రాలయం టెంపుల్ సర్కిల్‌లో ప్రారంభమై మాధవరంమీదుగా గిల్లేసుగూర్ వరకు సాగింది.
అక్కడ మార్నింగ్ బ్రేక్ ఇచ్చారు..బ్రేక్ ఫాస్ట్ తరువాత కర్ణాటక కీలక నేతలతో సమావేశం అయ్యారు..క్యాంపులో తన వ్యక్తగత టీంకు దిశానిర్ధేశం చేసిన ఆయన స్ధానికులతో సమావేశం అయ్యారు. రాయచూర్ జిల్లాలోని సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, కేపీసీసీ చీఫ్ బీకే శివకుమార్‌తో చర్చించారు. విద్యుత్ రంగ కార్మకులపై రాహుల్ ఆరాతీస్తున్నారు.
ఇక తిరిగి సాయంత్రం నాలుగు గంటకు కాలేబుడూర్ నుంచి పాదయాత్ర ప్రారంభమై.. యరగేరా లోని వాల్మికి సర్కిల్ వరకు వరకు సాగనుంది..రాత్రి 7గంటలకు యరగేరా గ్రామంలో కార్యకర్తల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు రాహుల్. రాత్రికి రాయచూర్‌లోని రంగనాధ స్వామి టెంపుల్ ప్రాంగణంలో బస చేయనున్నారు. 43వ రోజు పాదయాత్ర యరగేరా గ్రామంలో ముగియనుంది.
ఇక భారత్ జోడో యాత్రలో ఏపీ, కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. చిన్నారులు, పెద్దలు రాహుల్‌ను కలిసేందుకు సెక్యూరిటి వలయం దాటుకొని మరీ దూసుకు వస్తున్నారు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.
గ్రామాల్లో పంట పొలాల్లో దిగి రైతులతో మాట్లాడుతున్నారు.దారి పక్కన వేచి చూస్తున్న ప్రజల దగ్గరికి వెళ్లి పలకరిస్తున్నారు రాహుల్. ఈనెల 23న భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com