బ్రేకింగ్..పోలీసులు,కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట..కింద పడిన రాహుల్

బ్రేకింగ్..పోలీసులు,కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట..కింద పడిన రాహుల్
X

హాత్రాస్ అత్యాచార ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఒక్కసారిగా కింద పడిపోయారు. వెంటనే తేరుకున్న రాహుల్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆయనను పైకి లేపారు. ఇంత జరిగినా.. రాహుల్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags

Next Story