Uttar Pradesh: రైల్వే సిబ్బంది దాష్టీకం.. కదిలే రైలు నుంచి వ్యక్తిని..

Uttar Pradesh: రైల్వే సిబ్బంది దాష్టీకం.. కదిలే రైలు నుంచి వ్యక్తిని..
X
Uttar Pradesh: చిన్న చిన్న గొడవలు.. తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి.. కోపం కట్టలు తెంచుకుంటోంది.. ప్రాణాలు పోతాయని కూడా చూడకుండా ఓ వ్యక్తిని కదిలే రైల్లో నుంచి తోసేశారు రైల్వే సిబ్బంది.

Uttar Pradesh:చిన్న చిన్న గొడవలు.. తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి.. కోపం కట్టలు తెంచుకుంటోంది.. ప్రాణాలు పోతాయని కూడా చూడకుండా ఓ వ్యక్తిని కదిలే రైల్లో నుంచి తోసేశారు రైల్వే సిబ్బంది. వాటర్ బాటిల్ విషయంలో మొదలైన గొడవతో పాటు రైల్లో పాన్ మసాలా ఉమ్మేశాడని సిబ్బంది అతడిపై దాడికి దిగారు. ఉత్తరప్రదేశ్ లలిత్‌పూర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

రవి యాదవ్ అనే వ్యక్తి తన సోదరితో కలిసి రప్తి సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. జిరోలీ దగ్గరకు చేరుకోడానే ప్యాంట్రీ స్టాఫ్‌తో అతడికి గొడవ మొదలైంది. ఈ తరుణంలో లలిత్‌పూర్ స్టేషన్ దగ్గర రవి యాదవ్ సోదరిని సిబ్బంది దించేశారు. కానీ రవిని దిగకుండా అడ్డుకున్నారు.

ఈలోపు రైలు కదిలింది. బలవంతంగా అతడిని ఆపి.. రైలులోనే దాడి చేశారు. ఆపై అతన్ని పట్టాలపైకి విసిరేశారు. స్థానికులు రవిని గమనించి ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తు అతడు ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డాడని ఝాన్సీ పోలీసులు వెల్లడించారు. రవి ఫిర్యాదు మేరకు ప్యాంట్రీ సిబ్బందిపై కేసు నమోదు చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు.

Tags

Next Story