తమిళనాడును తాకిన ఈశాన్య రుతుపవనాలు.. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు

X
By - Nagesh Swarna |30 Oct 2020 11:09 AM IST
ఈశాన్య రుతుపవనాలు తమిళనాడును తాకాయి. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో చెన్నై జలమయం అయింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. తమిళనాడులో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని 8 జిల్లాలతో పాటు.. పుదుచ్చేరిలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. చెన్నైలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీ వరద వచ్చి చేరింది. ఆ వర్షపు నీటిని తొలగించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ప్రజల సహాయార్ధం హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. నీళ్లు నిలవడం, చెట్లు పడిపోవడం వంటి ఫిర్యాదులను.. నమ్మ చెన్నై యాప్‌లో.. రిజిస్టర్ చేయాలని అధికారులు సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com