ప్లాస్మా దానం చేయలేకపోయాను: రాజమౌళి

ప్లాస్మా దానం చేయలేకపోయాను: రాజమౌళి
టాలీవుడ్ చిత్ర దర్శకుడు రాజమౌళి కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. అనంతరం తన శరీరంలో యాంటిబాడీస్ ఉత్పత్తి అయితే ప్లాస్మా

టాలీవుడ్ చిత్ర దర్శకుడు రాజమౌళి కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. అనంతరం తన శరీరంలో యాంటిబాడీస్ ఉత్పత్తి అయితే ప్లాస్మా దానం చేస్తానని, కొవిడ్ నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేసి మానవత్వాన్ని చాటుకోవాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. అందరికీ చెప్పారు కాని తాను మాత్రం చేయలేకపోతున్నారు. అందుకు కారణం యాంటీ బాడీస్ కోసం తనని పరీక్ష చేసిన వైద్యులు ఐజీజీ లెవల్స్ 8.62నే ఉన్నాయని అవి 15 ఉండాలని తెలిపారట. ఈ రోజు పెద్దన్నయ్య కీరవాణి, ఆయన తనయుడు భైరవ ప్లాస్మాను కిమ్స్ ఆసుపత్రిలో డొనేట్ చేశారు అని పేర్కొన్నారు రాజమౌళి. మన శరీరంలో అభివృద్ధి చెందుతున్న ప్రతిరోధకాలు పరిమిత సమయం వరకు మాత్రమే ఉంటాయని, వైరస్ నుండి కోలుకున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మాను దానం చేయడం ప్రారంభిస్తే మంచిది అని ఆయన ట్వీట్ చేశారు.



Tags

Read MoreRead Less
Next Story