Rajasthan Assembly: రాజస్థాన్ ప్రభుత్వం వినూత్న ప్రయత్నం.. పిల్లల్ని అసెంబ్లీలో మాట్లాడిద్దాం..

Rajasthan Assembly (tv5news.in)
Rajasthan Assembly: చిన్న పిల్లలు మీకేం తెలుసు అంటుంటారు.. ఈరోజుల్లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చిన్నవారు కూడా టెక్నాలజీ సహాయంతో ఎంతో నాలెడ్జ్‌ను సంపాదించుకుంటున్నారు. ఎంతోమంది పెద్దవాళ్లు కూడా చేయలేని పనులను చిన్న పిల్లలు చేసి చూపిస్తున్నారు. ఆ పిల్లలోనుండే ఎంతోమంది శాస్త్రవేత్తలు పుట్టుకొస్తున్నారు. అందుకే పిల్లలను తక్కువ చేసి చూడొద్దని చెప్పడానికి రాజస్థాన్ ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేసింది.
నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇండియాలోని 15 రాష్ట్రాల నుండి కొంతమంది పిల్లలను ఎంపిక చేసి రాజస్థాన్ అసెంబ్లీలో 'చిల్డ్రన్స్ సెషన్'ను ఏర్పాటు చేసింది. ఈ పిల్లల మేధాశక్తి, వాక్ చాతుర్యం చూస్తే పెద్దలు సైతం నివ్వెరపోతారు. అసెంబ్లీ అంటే రాష్ట్రంలో, దేశంలో సమస్యలను చర్చించుకునే చోటు అని ఆ పిల్లలకు ఎవరు చెప్పారో కానీ వారు దానికి అనుగుణంగానే నడుచుకున్నారు.
ఈ 'చిల్డ్రన్స్ సెషన్'లో పిల్లలు అడిగిన ప్రశ్నలు చాలామందిని ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ పిల్లలు బాల్య వివాహాల గురించి చర్చించిన విధానం అందరినీ కట్టిపడేసింది. అంతే కాదు అనుభవం ఉన్న రాజకీయ నాయకుల లాగా ఉన్న వారి ప్రవర్తన కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. నాయకులందరూ వీరిని కళ్లార్పకుండా అలాగే చూస్తూ ఉండిపోయారు. అందులో చాలామంది పిల్లలు ప్రతీ సంవత్సరం ఇలాంటి ఒక 'చిల్డ్రన్స్ సెషన్' జరగాలని.. అప్పుడే వారికి కూడా మాట్లాడే అవకాశం దక్కుతుందని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com