పండగ ఉంది.. పటాకుల్లేవు: ముఖ్యమంత్రి

పండగ ఉంది.. పటాకుల్లేవు: ముఖ్యమంత్రి
X
బాణసంచా వాడకాన్ని నిషేధించాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.

కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గినా వైరస్‌ని తక్కువ అంచనా వేయడానికి లేదు.. వైరస్ సంబంధిత వ్యాధులన్నీ ఊపరితిత్తుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అసలే శీతాకాలం దగ్గు, ఆయాసంతో శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు తీవ్రంగా సతమతమవుతుంటారు.. ఈ పరిస్థితిలో దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని కాల్చే టపాసులు వారిని మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్ ప్రభుత్వం పటాకుల అమ్మకాలను నిషేధించింది.

మహమ్మారికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఈ చర్య సహాయపడుతుందని భావిస్తున్నారు. పటాకుల అమ్మకం కోసం తాత్కాలిక లైసెన్స్‌ను నిషేధించాలని, దాంతో పాటు వివాహాలు, ఇతర కార్యక్రమాలలో బాణసంచా వాడకాన్ని నిషేధించాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. కోవిడ్ సోకిన రోగుల ఆరోగ్యం బాణసంచా కారణంగా వెలువడే విషపు పొగ వారిని మరింత అనారోగ్యానికి గురి చేస్తుంది. వీటినుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి పటాకుల అమ్మకాలను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించడం చాలా ముఖ్యమైనది ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

Tags

Next Story