Rajasthan Beggar Free State బెగ్గర్ ఫ్రీ రాష్ట్రం.. ముఖ్యమంత్రి ఆదేశాలతో రోజుకు రూ.215

Rajasthan Beggar Free State బెగ్గర్ ఫ్రీ రాష్ట్రం.. ముఖ్యమంత్రి ఆదేశాలతో రోజుకు రూ.215

Rajasthan Beggar Free State

Rajasthan Beggar Free State:

Rajasthan Beggar Free State కోట్ల మంది జనాభాలో కొందరి జీవితాలు దుర్భరం.. బ్రతుకు బండి సాగించడానికి నాలుగు రోడ్ల కూడలిలో యాచిస్తూ, పేవ్‌మెంట్ మీద భారమైన జీవితాలను గడుపుతుంటారు. అడుక్కునే వారంటే అందరికీ చిన్న చూపే.. వారిని జన జీవన స్రవంతిలో కలపాలని, సమాజంలో భాగస్వాములను చేయాలని రాజస్థాన్ ప్రభుత్వం యోచించింది. యాచకుల జీవితాలను మార్చేందుకు కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే జైపూర్‌లో 'బెగ్గర్‌ ఫ్రీ' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాజస్తాన్ స్కిల్ అండ్ లైవ్లీ హుడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఆర్ఎస్ఎల్‌డీసీ), సోషల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ భాగస్వామ్యంతో బెగ్గర్ ఫ్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

కార్యక్రమంలో భాగంగా 43 మంది యాచకులను చేరదీశారు. వారికి యోగా, క్రీడలు, కంప్యూటర్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆర్ఎస్ఎల్‌బీసీ చైర్మన్ నిరజ్ కుమార్ పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యాచకులందర్నీ బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. యాచకులు లేని రాష్ట్రంగా రాజస్థాన్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పవన్ తెలిపారు.

మానసికంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు యోగా ఉపకరిస్తుందని ట్రెయినర్ చెప్పారు. మూడున్నర నెలల పాటు వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు రాజస్థాన్ ప్రభుత్వం వారికి రోజుకు రూ.215 చెల్లిస్తుంది. ఈ నగదు భవిష్యత్తులో వారి వ్యాపార అవసరాలకు ఉపయోగపడుతుందని సంస్థ అధికారి వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story