Rajasthan : ఐఫోన్లు వద్దు.. తిరిగి ఇచ్చేస్తున్నాం : బీజేపీ

Rajasthan : ఐఫోన్లు వద్దు.. తిరిగి ఇచ్చేస్తున్నాం : బీజేపీ
Rajasthan : బుధవారం(ఫిబ్రవరి 23)న రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టింది.

Rajasthan : బుధవారం(ఫిబ్రవరి 23)న రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం శాసనసభలోని ఎమ్మెల్యేలందరికీ ఐఫోన్ 13ని బహుమతిగా ఇచ్చింది. ఆనవాయితీగా ఎమ్మెల్యేలకు బడ్జెట్ కాపీని బ్రీఫ్‌కేస్‌లో ఇస్తారు.. అయితే ఈసారి వారికి బడ్జెట్ కాపీతో పాటుగా లోపల ఐఫోన్ 13 ఉన్న లెదర్ బ్రీఫ్‌కేస్‌ను అందించారు.

ఒక్కో ఐఫోన్ 13 విలువ సుమారుగా రూ. 75వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. మొత్తం 200 ఐఫోన్ లకి రెండు కోట్ల వరకు ఖర్చు అవుతోందని సమాచారం. అయితే గెహ్లాట్ ప్రభుత్వం ఇచ్చిన ఐఫోన్లను తిరిగి ఇచ్చేయాలని ఆ రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఐఫోన్‌ను తిరిగి ఇచ్చేస్తామని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సతీష్ పూనియా ప్రకటించారు.

గులాబ్ కటారియా, రాజేంద్ర రాథోడ్ మరియు ఇతర శాసనసభ్యులతో చర్చించిన తరువాత, రాష్ట్రంపై ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐఫోన్‌లను రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యేలందరూ తిరిగి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా సతీష్ పూనియా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా 200 మంది శాసనసభ్యులున్న సభలో బీజేపీకి 71 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

అయితే ఇలా బహుమతులు ఇవ్వడం కొత్తేమి కాదు.. గతేడాది కూడా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఎమ్మెల్యేలకు బడ్జెట్ కాపీతోపాటు ఐప్యాడ్‌లను బహుమతిగా అందజేశారు.

Tags

Read MoreRead Less
Next Story