Rajasthan Bride : హ్యాట్సాఫ్ : కట్నం డబ్బులతో బాలికలకి హాస్టల్..!

Rajasthan Bride : పెళ్లి కోసం ఎంతైనా ఖర్చు పెడతారు కొందరు .. ఇక కట్నం విషయంలో అయితే తగ్గేదే..లే అన్నట్టుగా ఉంటారు. కోట్లు కట్నంగా ఇచ్చి మరీ కూతుళ్ళ పెళ్ళిళ్ళు గ్రాండ్‌గా చేస్తుంటారు.. దీనిని వారు ఓ స్టేటస్‌గా ఫీల్ అవుతుంటారు. కానీ ఈ విషయంలో కొందరు మాత్రమే ఆ డబ్బును మరో మంచి పని కోసం ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోబోయే ఓ పెళ్లి కూతురు, అమె తండ్రి కూడా ఆ కోవాకిందికే వస్తారు.
తన పెళ్ళికోసం తన తండ్రి ఇవ్వాలనుకున్న కట్నం డబ్బులతో బాలికల హాస్టల్ నిర్మించాలని అనుకుంది ఓ అమ్మాయి.. అనుకున్నదే పనిగా వెళ్లి తన తండ్రిని వెళ్లి అడిగింది. కూతురి కోరిక విన్న ఆ తండ్రి ముందుగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఆమె అడిగిన కోరికకు ముగ్దుడయ్యాడు. కూతురు అడిగినదానికి ఒకే చెప్పాడు. కూతురికి కట్నంగా ఇవ్వాలని అనుకున్న రూ.75లక్షలకు మరో 25 లక్షలు కలిపి మొత్తం కోటి రూపాయలను కలిపి బాలికల హాస్టల్ నిర్మించేందుకు విరాళంగా ఇచ్చాడు.
ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బార్మర్ నగరంలోని కిషోర్ సింగ్ కనోడ్ కుమార్తె అంజలి కన్వర్.. ఆమెకి నవంబర్ 21న ప్రవీణ్ సింగ్‌తో వివాహం జరిగింది. పెళ్ళికి ముందు తన తండ్రిని కలిసిన ఆమె బాలికల హాస్టల్ నిర్మించాలని కోరింది. దీనికి ఆమె తండ్రి కూడా ఒకే చెప్పడంతో తను అనుకున్న కల నెరవేరింది.
తారాతార మఠాధిపతి మహంత్ ప్రతాప్ పూరీ ఆ నవవధువుని ప్రశంసించారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇక హాస్టల్ ఖర్చు మరో రూ.50 లక్షల నుంచి రూ.75లక్షలు అవసరం అవుతాయని ఆయన చెప్పగా అది కూడా తానే భరిస్తానని ఆ వధువు తండ్రి హామీ ఇవ్వడం మరో విశేషం.
#positivenews #barmer #girleducation pic.twitter.com/UPl9BqXKfE
— Tribhuwan Singh Rathore 🇮🇳 (@FortBarmer) November 24, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com