Transgender Welfare Fund : హిజ్రాల కోసం రాజస్థాన్ సర్కార్ కీలక నిర్ణయం.. దేశంలోనే తొలిసారిగా..!

Transgender Welfare Fund : హిజ్రాల కోసం రాజస్థాన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా వారికోసం ప్రత్యేకంగా నిధిని కేటాయించింది. ఇందుకోసం ఏడాదికి రూ. 8.82 కేటాయిస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ నిధిని వారి సామజీక ఆర్ధిక బలోపేతానికి, విద్య మరియు కమ్యూనిటీ హాల్‌ల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలకి ఉపయోగిస్తామని తెలిపింది.
ఇక లింగమార్పిడి చేయించుకునేవాళ్ళకి రూ. 2.5లక్షలు ఇస్తామంది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, లింగమార్పిడి సంక్షేమ బోర్డు సభ్యురాలు పుష్ప నాయి రాష్ట్ర సర్కారుకి ధన్యవాదాలు తెలిపారు. కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం రాజస్థాన్‌లో లింగమార్పిడి జనాభా సంఖ్య 16,500.. ఇప్పుడు ఆ సంఖ్య 75,000కి చేరుకుందని ప్రభుత్వం అంచనా వేసింది.
అటు ప్రతి సంవత్సరం నవంబర్ 20న జరిగే జాతీయ లింగమార్పిడి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో పండుగలను సాంస్కృతిక మరియు సాంప్రదాయ జాతరలు, ఆటలు మరియు క్రీడా పోటీలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ లకి రూ. 10 లక్షలు.. జిల్లా స్థాయి కోసం రూ. 1 లక్షను కేటాయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com