ఢిల్లీ బాటలోనే రాజస్థాన్.. 15 రోజుల లాక్‌డౌన్..!

ఢిల్లీ బాటలోనే ఇప్పుడు రాజస్థాన్‌లో కూడా లాక్‌డౌన్ విధించారు. ఢిల్లీలో 6 రోజులు లాక్‌డౌన్ విధిస్తే రాజస్థాన్‌లో 15 రోజులు లాక్‌డౌన్ అమలు చేయబోతున్నారు. ఇవాళ్టి నుంచి మే 3 వరకూ లాక్‌డౌన్ అమల్లోకి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త కోవిడ్ నిబంధనలు విడుదల చేసిన రాజస్థాన్ సర్కార్.. లాక్‌డౌన్ ఉన్నా నిత్యావసరాల దుకాణాలకు మాత్రం సాయంత్రం 5 గంటల వరకూ అనుమతి ఇచ్చింది. అలాగే కూరగాయల వ్యాపారులకు 7 గంటల వరకూ.. పెట్రోల్ బంక్‌లకు 8 గంటల వరకూ తెరిచి ఉంచేందుకు వీలుంటుంది. అటు, ప్రజారవాణాకు షరతులతో అనుమతులు ఇచ్చినా..... విద్యాసంస్థలు, పరిశ్రమలు మాత్రం పూర్తిగా మూసేయాలని నిర్ణయించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో నియంత్రణకు ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పడం లేదని రాజస్థాన్ ప్రభుత్వం చెప్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com