Shanti Dhariwal :'రేప్ కేసుల్లో రాజస్థాన్ నంబర్ వన్ ..మాది పురుషుల రాష్ట్రం'.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..!

Shanti Dhariwal : రాజస్థాన్ మంత్రి శాంతి ధరివాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. రేప్ కేసుల్లో రాజస్థాన్ నంబర్ వన్ స్థానంలో ఉందని.. అందులో సందేహం లేదని అన్నారు. ఎందుకంటే రాజస్థాన్ పురుషుల రాష్ట్రమని అసెంబ్లీలో శాంతి ధరివాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యల పైన సర్వత్రా విమర్శలు వచ్చాయి.
జాతీయ మహిళా కమిషన్ (NCW) చైర్‌పర్సన్ రేఖా శర్మ .. మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. "రాజస్థాన్ ప్రభుత్వంలో ఇలాంటి మంత్రులు ఉన్నారు, అందుకే రాష్ట్రంలోని మహిళలు భయంకరమైన నేరాలకు గురవుతున్నారు .. పోలీసులు ఏమీ చేయరు. ఇలాంటి మంత్రులు ఉంటే రాష్ట్రంలోని మహిళలు ఎలా సురక్షితంగా ఉంటారు?" అని ట్వీట్ చేశారు.
అంతేకాకుండా సంబంధిత మంత్రిని సభ నుంచి సస్పెండ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషికి లేఖ రాశారు. మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో తాను సభలో క్షమాపణలు చెబుతానని శాంతి ధరివాల్ అన్నారు. తాను ఎల్లప్పుడూ మహిళలను గౌరవిస్తానని, ప్రతిదానిలో వారిని పాల్గొనమని ప్రోత్సహిస్తానని చెప్పుకొచ్చారు.. అనుకోకుండా నోరు జారానని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com