సూపర్ స్టార్ పార్టీ పేరు.. సింబల్ సిద్దం

రజనీ రాజకీయ ఎంట్రీకి తెరపడింది. వచ్చే ఏడాది మే నెలలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు రజనీ కాంత్ సమాయత్తం అవుతున్నారు. డిసెంబర్ 1న పార్టీ పేరు.. జనవరి 1న పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ ఇప్పటికే ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో రజనీ పార్టీ పేరు, సింబల్ కోసం ఈసీకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
రాజకీయంగా అంతా సిద్ధం చేసుకుంటున్న రజనీ.. కొత్తగా పార్టీ స్థాపించే బదులు.. ఇప్పటికే రిజిస్టర్ అయిన పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. అలాగే తన సినీ జీవితాన్ని మలుపు తిప్పిన బాషా సినిమాలోని ఆటో డ్రైవర్ క్యారెక్టర్‌నే పొలిటికల్ కెరీర్‌గా వాడుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం దగ్గర ఇప్పటికే రిజిస్టర్ అయిన 'మక్కల్ సేవై కట్చి' అనే పార్టీ పేరుతో రాజకీయ రణక్షేత్రంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీ కోసం రండు నెలల క్రితమే ఆటో గుర్తును కేటాయించినట్లు తెలుస్తోంది. మక్కల్ సేవై కట్చి అంటే సేవే మార్గం అని అర్థం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com