Rajnath singh : హెలికాప్టర్ ప్రమాదంపై లోక్‌సభలో రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన

Rajnath singh :  హెలికాప్టర్ ప్రమాదంపై లోక్‌సభలో రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన
X
Rajnath singh : కూనూరు హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో ప్రకటన చేశారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే విచారణ మొదలైందన్నారు.

Rajnath singh : కూనూరు హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో ప్రకటన చేశారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే విచారణ మొదలైందన్నారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల సమయంలో హెలికాప్టర్‌కు రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయని తెలిపారు. హెలికాప్టర్‌ పెద్ద శబ్దంతో పేలిపోవడంతో స్థానికులు ఘటనా స్థలానికి వెళ్లారని, స్థానికులు వెళ్లే సరికే హెలికాప్టర్‌ మంటల్లో ఉందన్నారు రాజ్‌నాథ్‌ సింగ్.

ప్రమాదంలో మొత్తం 13 మంది చనిపోయారని, గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. చనిపోయిన వారందరికీ శ్రద్ధాంజలి ఘటించిన రాజ్‌నాధ్‌ సింగ్.. ఈ సాయంత్రానికి అమరవీరుల భౌతికకాయాలను ఢిల్లీకి తీసుకొస్తామని, రేపు సైనిక లాంచనాలతో అంత్యక్రియలు జరుపుతామని తెలిపారు. బిపిన్ రావత్‌ సహా ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది మృతిపై లోక్‌సభ సంతాపం తెలిపింది. లోక్‌సభ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Tags

Next Story