భారత్-చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితిపై రాజ్యసభలో రాజ్‌నాథ్ ప్రకటన

X
భారత్- చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితిపై.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లో రాజ్యసభలో ప్రకటన చేశారు. సరిహద్దు దేశాలతో సామరస్యంగా ఉండటాన్నే భారత్ కోరుకుంటోందన్నారు. ఇందులో భాగంగానే.. ఇప్పటికే చైనా దౌత్యపరంగా, సైనికాధికారుల స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. అవి తేలేవరకు గతంలో చేసుకున్న ఒప్పందాలకే ఇరు వర్గాలు కట్టుబడి ఉండాలన్నారు. అయితే చైనా ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తోందన్నారు. ఇలా ఆగస్టు 29,30 తేదీల్లో జరిగిన ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టిందన్నారు. సరిహద్దుల్లో ఏర్పడే ఎలాంటి అనిశ్చితినైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందన్నారు రాజ్‌నాథ్ సింగ్.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
