రజనీ ఆరోగ్యంపై అపోలో హెల్త్ బులెటిన్..

రజనీ ఆరోగ్యంపై అపోలో హెల్త్ బులెటిన్..
X
ఆసుపత్రిలోనే ఉంటారని మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ రక్తపోటు హెచ్చుతగ్గుల కారణంగా శుక్రవారం అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు ఈ ఉదయం తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నటుడు ఆసుపత్రిలోనే ఉంటారని మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రజనీ గత పది రోజులుగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక సినిమా షూటింగ్ లో ఉన్నారు. వైద్యులు అతనికి పూర్తి విశ్రాంతి అవసరమని చెప్పారు. ఆయనను పరామర్శించేందుకు ఎవరూ రావొద్దని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags

Next Story