బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు, 2020కి రాజ్యసభ మంగళవారం ఆమోదం తెలిపింది.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు, 2020కి రాజ్యసభ మంగళవారం ఆమోదం తెలిపింది. ఆర్బీఐ పర్యవేక్షణలోకి సహకార బ్యాంకులను తీసుకొచ్చేందుకు ఈ బిల్లును కేంద్రం ప్రతిపాదించింది. ఈ బిల్లు గురించి హౌస్‌లో మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. కరోనా కష్టకాలంలో చాలా సహకార బ్యాంకులు ఒడిదుడులకు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఆర్బీఐ ఈ పరిస్థితిని పరిశీలిస్తుందని.. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటం కోసం ఈ సవరణ చేసినట్లు తెలిపారు. ఆర్బీఐ పర్యవేక్షణలోకి సహకార బ్యాంకులు వస్తే.. వాటి పరిస్తితి మెరుగుపడే అవకాశం ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

Tags

Next Story