Rakesh Tikait : చట్టాలు రద్దయ్యేదాకా ఇంటికి వెళ్ళేది లేదు : రైతు సంఘాలు

Rakesh Tikait  : చట్టాలు రద్దయ్యేదాకా ఇంటికి వెళ్ళేది లేదు : రైతు సంఘాలు
Rakesh Tikait : కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా దేశ ప్రధాని మోదీ ఈరోజు ప్రకటించారు.

Rakesh Tikait : కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా దేశ ప్రధాని మోదీ ఈరోజు ప్రకటించారు. ఇందుకు సంబంధించి వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు ఇళ్లకు వెళ్లిపోవాలని ఈ సందర్భంగా మోదీ విజ్ఞప్తి చేశారు. అయితే మోదీ ప్రకటన పైన రైతు సంఘాలు స్పందించాయి. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయిత్ మాట్లాడుతూ.. ఈ రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంటులో రద్దు చేసేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. రైతు చట్టాలు రద్దయ్యాకే తాము ఇళ్లకు వెళ్తామని ప్రకటించారు. అలాగే కనీస మద్దతు ధరతో పాటుగా పలు సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని.. వీటికి ప్రధాని పరిష్కరించలేదని అన్నారు. ప్రభుత్వం రైతులతో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా పంజాబ్, యూపీలో ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story