మీకేం పన్లేదా.. మాపై పుకార్లు గుప్పించడమేనా: రకుల్ ఫైర్

మీకేం పన్లేదా.. మాపై పుకార్లు గుప్పించడమేనా: రకుల్ ఫైర్
X
రకుల్ ప్రీత్ సింగ్ అలాంటి వార్తలు సృస్టించే వాళ్లమీద ఫైర్ అయ్యారు.

నిప్పులేందే పొగరాదన్న దాంట్లో నిజమెంతో తెలియదు కానీ.. సినిమా వాళ్ల గురించి తెలిసింది కొంత అయితే దానికి కథలు అల్లడం.. వాటిని నటీనటులు తేలిగ్గా కొట్టేయడం మమూలే. మరీ హద్దు మీరితే లెప్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్నారు నేటి తరం నటీనటులు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు రాసినా అడిగేవాళ్లు లేరనుకుంటారు.. అన్నీ కల్పించి రాస్తారు. మేం కూడా మనుషులమే.. మాకూ ఫీలింగ్స్ ఉంటాయని సమంత నిర్వహించే శామ్ జామ్‌ షోకి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ అలాంటి వార్తలు సృస్టించే వాళ్లమీద ఫైర్ అయ్యారు.

హైదరాబాద్‌లో తానొక ఇల్లు కొనుక్కుంటే అది ఎవరో గిప్ట్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. వాళ్లెవరో ఇల్లు ఇస్తే మనమెందుకు కష్టపడడం అని ప్రశ్నించింది. పుకార్లు పుట్టించే వాళ్ల గురించి మాట్లాడడం కూడా టైమ్ వేస్ట్ అని రకుల్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. కాలేజ్ రోజుల్లోనే స్కూటీ రైడ్‌లకు ఛార్జ్ వసూలు చేసేదానివట కదా అని సమంత అడగ్గా అలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది రకుల్ ప్రీత్.


తనకు ఇష్టమైనవి సినిమాల్లో నటించడం, జిమ్ చేయడం.. అంతకు మించి మరో వ్యాపకం లేదు అని వివరించింది. సినిమాలతో పాటు బిజినెస్‌లో కూడా తనదైన ముద్ర వేసిన రకుల్ హైదరాబాద్, వైజాగ్‌లలో జిమ్ సెంటర్స్ నడుపుతోంది. కాగా ప్రస్తుతం రకుల్ వైష్ణవ్ తేజ్, నితిన్‌లతో నటిస్తోంది. అలాగే హిందీలో మేడే సినిమాలో అజయ్ దేవగన్‌తో కలిసి నటిస్తోంది. ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా ఓ హీరోగా నటిస్తున్నాడు.

Next Story