12 Sep 2020 12:10 PM GMT

Home
 / 
జాతీయం / డ్రగ్స్ కేసులో రకుల్...

డ్రగ్స్ కేసులో రకుల్ పేరు..

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉందన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి.

డ్రగ్స్ కేసులో రకుల్ పేరు..
X

సినిమా ఇండస్ట్రీకి డ్రగ్స్ అంశం కొత్తకాదు.. ఈ విషయంపై ఎప్పుడూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. డ్రగ్స్ కు బానిసైన కొందరు నటీ నటులు ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ డ్రగ్స్ కు బానిసయ్యే ప్రాణాలు కోల్పోయాడని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అతడి స్నేహితురాలు రియా చక్రవర్తి అరెస్టయ్యారు. ఆమె డ్రగ్స్ తీసుకుంటున్న మరో 25 మంది సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించింది. వారికి కూడా నోటీసులు జారీ చేసేందుకు సిద్దమవుతోంది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. కాగా రియా వెల్లడించిన పేర్లలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉందన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే రకుల్ గత మూడు రోజులుగా తెలంగాణలోని వికారాబాద్ శివారులో ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. శనివారం షూటింగ్ లో ఉన్న రకుల్ కి.. డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు రావడంతో అక్కడి నుంచి హుటాహుటిన జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. రకుల్ మేనేజర్ ఆమెపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు.

Next Story