అభిమానుల మృతిపట్ల ట్విట్టర్ వేదికగా రామ్ చరణ్..

నటీ నటుల పట్ల అభిమానం మరీ హద్దులు మీరితే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. స్టార్ హీరోలంతా తమ అభిమానులను ఉద్దేశించి సందర్భం వచ్చినప్పుడల్లా హెచ్చరిస్తూనే ఉంటారు. ముందు మీ కుటుంబం, తరువాతే మేము అని చెబుతుంటారు. తాజాగా కుప్పంలో జరిగిన సంఘటనపట్ల మెగాహీరో రామ్ చరణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా అభిమానులు ఫ్లెక్సీ కడుతున్న సమయంలో విద్యుద్ఘాతం చోటు చేసుకుని ముగ్గురు అభిమానులు మరణించారు.
ట్విట్టర్ వేదికగా రామ్ చరణ్ అభిమానులను ఉద్దేశించి మీ ఆరోగ్యం, మీ ప్రాణం కంటే ఏదీ విలువైంది కాదు. మీరంతా దీన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని నా మనవి.. దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న వకీల్ సాబ్ చిత్ర యూనిట్ మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు అందించనున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది.
— Ram Charan (@AlwaysRamCharan) September 2, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com