జాతీయం

Ramdas Athawale : ఎంతమంది నేతలు వచ్చినా మోదీని ఏమీ చేయలేరు : రాందాస్ అత్వాలే

Ramdas Athawale : దేశంలో ఎవరిప్రార్ధనలను వారు చేసుకునే హక్కు ఉందన్నారు కేంద్రమంత్రి రాందాస్ అత్వాలే.

Ramdas Athawale :  ఎంతమంది నేతలు వచ్చినా మోదీని ఏమీ చేయలేరు : రాందాస్ అత్వాలే
X

Ramdas Athawale : దేశంలో ఎవరిప్రార్ధనలను వారు చేసుకునే హక్కు ఉందన్నారు కేంద్రమంత్రి రాందాస్ అత్వాలే. ఎంఎన్‌ఎస్‌ అధ్యక్షుడు రాజ్‌థాకరే ప్రకటనను ఆయన వ్యతిరేకించారు. మజీద్‌లల్లో లౌడ్‌స్పీకర్లు తీసివేయాలని థాకరే అనడం సరైంది కాదన్నారు. ఈ విషయంలో దాదాగిరి చేయడం తగదన్నారు. తెలంగాణాలో దళితులపై అత్యాచారాలు ఆపాలన్నారు. వారికి భూములు, ఇళ్లను కేటాయించాలని సీఎంకేసీఆర్‌కు విజ్ఞప్తిచేశారు. మోదీ అత్యంత శక్తివంతమైన నేత అని.. ఆయనను ఎంతమంది నేతలు కలిసి వచ్చినా ఏమి చేయలేరంటూ థర్డ్‌ ఫ్రంట్‌ గురించి కామెంట్ చేశారు. ఎన్టీయేను, మోదీని ఓడించడం ఎవరివల్లకాదన్నారు. తాను కూడా తెలంగాణా ఉద్యమంలో సీఎంకేసీఆర్‌తో కలిసిపాల్గొన్నానని కేంద్రమంత్రి రాందాస్ అత్వాలే గుర్తు చేశారు.

Next Story

RELATED STORIES